విరుచుకుపడిన వరుణుడు! | - | Sakshi
Sakshi News home page

విరుచుకుపడిన వరుణుడు!

Published Fri, Apr 4 2025 1:59 AM | Last Updated on Fri, Apr 4 2025 1:59 AM

విరుచ

విరుచుకుపడిన వరుణుడు!

కర్నూలు(అగ్రికల్చర్‌)/సాక్షినెట్‌వర్క్‌: జిల్లాలోని వి విధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడంతో అన్నదాతకు నష్టం వాటిల్లింది. దేవనకొండ, సి. బెళగల్‌, కోడుమూరు మండలాల్లో కోసి ఆరబెట్టిన ఉల్లి పూర్తిగా తడిచిపోయింది. కొన్ని చోట్ల టార్పాలిన్లు కప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే రాత్రి 7 నుంచి 11 గంటల వరకు అకాల వర్షాలు కురిశాయి. దేవనకొండ మండలం ఈదులదేవరబండ గ్రామంలో 42.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. సి.బెళగల్‌ మండలంలో 21.5 మి.మీ., ఎమ్మిగనూరు మండలంలో 20.5 మి.మీ., గూడూరు మండలంలో 10 మి.మీ. ప్రకారం అకాల వర్షాలు కురిశాయి. కోడుమూరు, ఆదోని, గోనెగండ్ల, పత్తికొండ, కర్నూలు తదితర మండలాల్లో కూడా వర్షాలు కురిశాయి.

నష్టాలు ఇలా..

● సి.బెళగల్‌ మండలంలో గురువారం సాయంత్రం కురిసన గాలివానతో పొలాల్లో ఉన్న పైర్లు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న మిరప, పొగాకు దిగుబడులు తడిసిపోయాయి. తుంగభద్ర నదితీర గ్రామాల్లో రబీలో సాగు చేసిన వరి పైరు నేలకొరిగింది.

● దొర్నిపాడు, క్రిష్టిపాడు, డబ్ల్యూ గోవిందిన్నె గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. భారీ గాలులకు మిరప కాయలన్నీ రాలిపోయాయి. కల్లాల్లో ఉన్న మిరప పూర్తిగా తడిసి పోయింది.

● కొలిమిగుండ్ల, కల్వటాల, నందిపాడు, తిమ్మనాయినపేట, కమ్మవారిపల్లె, అబ్దులాపురం గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పసుపు పంటను కోసిన రైతులు ఉడికించేందుకు తిమ్మనాయినపేట గ్రామం శివారులో ఆరబెట్టుకున్నారు. ఉన్నట్లుండి ఆకాల వర్షం కురవడంతో రైతులు పరుగులు పెట్టి తడవకుండా పట్టలు కప్పుకోవాల్సి వచ్చింది.

● మహానంది మండలంలో గురువారం సాయంత్రం అరగంట పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. తిమ్మాపురం, బుక్కాపురం తదితర గ్రామాల్లోని పొలాల్లో ఆరబెట్టిన పసుపు తడిచిపోపోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

● బండిఆత్మకూరు మండలంలో ఊహించని విధంగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కడమల కాలువ, వెంగళరెడ్డి పేట, ఈర్నపాడు, సింగవరం గ్రామాల్లో కొన్నిచోట్ల వరి నేల కొరిగింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

● కోవెలకుంట్ల వ్యవసాయ సబ్‌డివిజన్‌లోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మొక్కజొన్న పంటలో కోత, నూర్పిడి పనులు కొనసాగుతున్నాయి. మిరపలో చివరి కోత పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. వర్షం కారణంగా కల్లాల్లో ఆరబోసిన మిరప, మొక్కజొన్న దిగుబడులు తడవకుండా పట్టలు కప్పుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. పొట్టదశలో ఉన్న వరి నేలవాలడంతో వడ్లు రాలిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● నందవరం మండలంలో నాగలదిన్నె, పెద్దకొత్తిలి, జొహరాపురం, గంగవరం, రాయచోటి, నందవరం, నదికై రవాడి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఽమొక్కజొన్న గింజలు, ఎండుమిర్చి తడిసిపోకుండా పట్టలు కప్పుకుంటూ అన్నదాతలు నానా అవస్థలు పడ్డారు. వరి, మొక్కజొన్న, మిరప పంటలు తిన్నాయి.

ఆశలు వర్షార్పణం

పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు

విరుచుకుపడిన వరుణుడు!1
1/3

విరుచుకుపడిన వరుణుడు!

విరుచుకుపడిన వరుణుడు!2
2/3

విరుచుకుపడిన వరుణుడు!

విరుచుకుపడిన వరుణుడు!3
3/3

విరుచుకుపడిన వరుణుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement