
విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం రానివ్వొద్దు
● ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్‌ప్రతాప్ రెడ్డి
ఆలూరు రూరల్/దేవనకొండ: సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్‌ప్రతాప్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ఆలూరులోని కేజీబీవీ, గిరిజన బాలికల, బాలుర, సమీకృత హాస్టళ్లతోపాటు దేవనకొండలోని అంగన్‌వాడీ కేంద్రాలు, జెడ్పీహెచ్ మెయిన్ స్కూల్, రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. పౌష్టికాహారం పెట్టట్లేదని, తమరు వస్తున్నట్లు తెలుసుకునే కాస్త నాణ్యతతో భోజనం వండినట్లు ఆలూరు గిరిజన బాలికల పాఠశాల కమిటీ చైర్మన్ శంకర్ నాయక్ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేయగా విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆలూరులోని 32 షాపును తనిఖీ చేశారు. స్టాకు వివరాలు తనిఖీ చేశారు. తూకాల్లో తేడాలు లేకుండా నిత్యావసర సరులకు సరఫరా చేయాలన్నారు. అంతకు ముందు మొలగవల్లి గ్రామంలో ఇంటింటి రేషన్ పంపిణీని పరిశీలించారు. తహసీల్దార్ గోవింద్ సింగ్, సీఎస్ డీటీ దీపా, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ రఘురామి రెడ్డి, ఎంఈఓ కోమలాదేవి, ఆర్‌ఐ బసవన్న గౌడ్, సీఐ రవిశంకర్ రెడ్డి ఆయా హాస్టళ్ల వార్డెన్లు, హెచ్‌ఎంలు ఉన్నారు.