
మద్యపాన వ్యసన విముక్తికి డీ–అడిక్షన్ సెంటర్లు
కర్నూలు: మద్యపాన వ్యసనం నుంచి విముక్తి కల్పించడానికి డీ–అడిక్షన్ సెంటర్‌లో చేర్పించి ఎకై ్సజ్ శాఖ అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు అన్నారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ కార్యాలయ సముదాయ ప్రాంగణంలో శనివారం కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్‌నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ (కేర్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎకై ్సజ్, కేర్ కమిటీ, అనంత ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, ఆల్కహాల్ అనామలీస్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మద్యపాన వ్యసనంతో దుష్పరిణామాలు, దానితో సమాజంలో ఎదురయ్యే సమస్యలు, వ్యసన విముక్తికి గల అవకాశాలను గురించి వక్తలు వివరించారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి మచ్చ సుధీర్ బాబు తదితరులు హాజరయ్యారు. మద్యపాన వ్యసనంతో వ్యక్తులు, కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక ఇబ్బందులను గురించి వివరించారు. ఆల్కహాల్, అనామలిస్ స్వచ్ఛంద సంస్థకు చెందిన జనార్దన్ తమ సంస్థ తరఫున అందించే మద్దతు, అవకాశాల గురించి వివరించారు. అనంత ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టుకు చెందిన రాజేంద్రప్రసాద్, ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రామకృష్ణారెడ్డి, రాజశేఖర్ గౌడ్, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఏసీ
హనుమంతరావు