రూ. 10 లక్షల విలువైన గంజాయి పట్టివేత
బయ్యారం: మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద మంగళవారం పోలీసులు రూ. 10 లక్షల విలు వైన 20 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. బస్టాండ్ సెంటర్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ స మయంలో అటువైపు సూట్ కేసుతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారి వద్ద ఉన్న సూట్‌కేసు తెరచి చూడగా అందులో రూ. 10 లక్షల విలువైన 20 కిలోల ఎండు గంజాయి లభించింది. వెంటనే అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించి ఒడిశాలోని పత్రాపూర్‌కు చెందిన సంతోశ్‌నాయక్, అర్జున్‌దాస్‌గా గుర్తించారు. ఎస్సై తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment