రాష్ట్రపతిని ఆకట్టుకున్న గద్వాల చేనేత చీరలు
గద్వాలటౌన్: రాష్ట్రపతి భవన్‌లో గద్వాల చేనేత చీరల ప్రదర్శన ఆకట్టుకుంది. అమృత్ కా మహోత్సవ్‌లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో దక్షిణ భారతంలో ప్రసిద్ధి చెందిన హస్తకళలు, హ్యాండ్‌ల్యూమ్, అథెంటిక్ సౌత్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషనల్‌లో తెలంగాణ నుంచి 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 25 చేనేత రంగానికి సంబంధించినవి ఉన్నాయి. ఖండాంతర ఖ్యాతి గడించిన గద్వాల చేనేత జరీ చీరలు ఎగ్జిబిషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గద్వాల చీరలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరీ చీరల ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. గద్వాల చేనేత జరీ చీరల ఉత్పుత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో సంఘం నాయకులు అక్కల శాంతరాం, అక్కల శ్రీనివాసులు, మంత్రి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment