మత్స్యకారుల జీవనాధారం చెరువు. చెరువులో చేపలు పెంచుకొని బతుకుతున్న మత్స్యకారులను ఇబ్బందులకు గురి చేయవద్దు. వర్షాలు కురిశాయని సంబరపడ్డాం. కానీ ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువుల్లో నీరు అడుగంటింది. చేపలకు సరైన నీరు లేక ఉత్పత్తిలో వృద్ధి లేదు. మోటార్ల ద్వారా చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లను సైతం తరలిస్తే చేపల మనుగడ కష్టమవుతుంది. వెంటనే చెరువుల్లో మోటార్ల ద్వారా నీటి తరలింపు ఆపాలి. అధికారులు చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలి.
– రాంచంద్రయ్య, వేపూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు
కొట్లాటకు వస్తున్నారు..
చెరువుల్లో మోటార్ల ద్వారా నీటి తరలింపును ఆపాలని, మోటార్లు తొలగించాలని చెబితే స్థానికంగా కొట్లాటకు వస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. సొసైటీ తరఫున లక్షలాది రూపాయలు వెచ్చించి చేపలు వదిలాం. నీటిని తోడేస్తే మేము తీవ్రంగా నష్టపోతాం. అధికారులు చొరవ తీసుకొని నీటి తరలింపును ఆపాలి.
– జిల్లెల శేఖర్, పెద్దదర్పల్లి
మత్స్య పారిశ్రామిక సహకార సంఘం
●
నీటి తరలింపును ఆపాలి..