మరికల్: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురైన భర్త తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ రాము వివరాల మేరకు.. మరికల్ మండలం తీలేర్‌కు చెందిన హరిజన్ సుభాష్ (32)తో నారాయణపేట మండలం పెద్దజట్రంకు చెందిన లాల్‌కోట భాగ్యమ్మతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో ఇటీవల భాగ్యమ్మ తల్లిగారింటికి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో తీలేర్‌కు రావాలని భర్త సుభాష్ ఆమెను పలుమార్లు వేడుకున్నా ఫలితం లేకపోవడంతో మనస్థాపానికి గురైన అతడు.. ఐదు రోజుల క్రితం గ్రామ శివారులోని చెరువులో దూకాడు. గమనిచ్చిన గ్రామస్తులు చెరువులో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆదివారం అందరూ ఉగాది పండుగ జరుపుకొంటున్న సమయంలో అతడు ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి కూతురు ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం
కల్వకుర్తి టౌన్: షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించి ఆస్థినష్టం జరిగిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో అప్నాబజార్ అనే గానుగ నూనె, కిరాణం దుకాణంలో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో దుకాణంలోని గానుగనూనె యంత్రంతో పాటుగా, వస్తువులు అగ్నికి ఆహుతి కాగా, అదే దుకాణంపైన ఉన్న ఎంఎస్ సొల్యూషన్స్ కంప్యూటర్ దుకాణంలో ఉన్న వస్తువులు కాలిపోయాయి.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దుకాణంలో నూనె ఉండటంతో మంటలు అధికంగా వ్యాపించి ఉంటాయని స్థానికులు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. సుమారు రూ.3 లక్షల ఆస్థినష్టం జరిగి ఉండవచ్చని బాధితులు తెలిపారు.
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తికి గాయాలు
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కొండపేటకు చెందిన తెలుగు కృష్ణమూర్తి బైక్‌పై నక్కలపల్లికి వెళ్తున్న క్రమంలో పొగాకు కంపెనీ స్టేజీలో జాతీయ రహదారి దాటుతుండగా కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
నాలుగు ఇళ్లలో చోరీ
కల్వకుర్తి రూరల్: మండలంలోని తాండ్రలో సోమ వారం తెల్లవారుజా మున తాళం వేసిన నాలుగు ఇళ్లలో దొంగలు చోరీకి పా ల్పడ్డారు. మొత్తం మూడు తులాల బంగారం, రూ.85 వేల నగదుతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. వసంత ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లి మూడు తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, రూ.70 వేలు చోరీ చేశారు. అలాగే వెంకటయ్య ఇంట్లో చొరబడి రూ. 10వేల నగదు అపహరించారు. యాదమ్మ ఇంట్లో రూ.5వేలు చోరీ చేశారు.
మరో వ్యక్తి కుమ్మరి పర్వతాలు ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లినా ఏమీ లభించలేదు. గ్రామానికి చెందిన బొట్టె శ్రీను ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై నిలిపి పొలంలో గేదెల పాలు పితుకుతుండగా.. దొంగలు గ్రామం నుంచి వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అయితే చోరీ ఘటన వివరాలను పోలీసులు విలేకరులకు అందించకుండా గోప్యంగా ఉంచారు.
హరిత లక్ష్యం అగ్గిపాలు
ఉండవెల్లి: మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో రహదారి పక్కన లక్షల్లో ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కలు అగ్గిపాలవుతున్నాయి. మొ క్కలు మంటల్లో తగులబడుతున్నా అదే రహదారిలోనే అధికారులు చూస్తూ వెళ్తున్నారే తప్పా మంటలు ఆర్పే ప్రయత్నం చేయలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభు త్వ లక్ష్యాన్ని స్థానిక అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.