
అదుపు తప్పిన లారీ
చారకొండ: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకకు దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చారకొండ మండలం జూపల్లి సమీపంలోని 167వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు చక్కెర లోడ్‌తో వేగంగా వెళ్తున్న లారీ.. జూపల్లి సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. గుంతల్లో సైతం లారీ వేగంగా వెళ్లడంతో ఇంజన్, బాడి క్యాబిన్ విడిపొయి పక్కనున్న పొలంలో కూప్పకూలింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ లక్ష్మీనారాయణ, క్లీనర్ ఏడుకొండలుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కల్వకర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఎస్‌ఐ అంజయ్య తెలిపారు.
ఇద్దరికి గాయాలు