చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల, చారకొండ, అగ్రహారం తండా, ఎకై ్సజ్ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు శుక్రవారం సారా స్థవరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో అగ్రహరంతండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాలు దాదాపుగా 6 క్వింటాళ్ల నల్లబెల్లం, 30 కిలోల పటిక, 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. అదే తండాకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ సిర్సనగండ్ల జాతర సందర్భంగా గ్రామాల్లో కాని, జాతర సమీపంలో నాటుసారా, మద్యం నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్‌ఫొర్స్‌మెంట్ సీఐ శారద, సిబ్బంది రామకృష్ణ, రఘు, మహేష్, భీమమ్మ, నార్య ఉన్నారు.