
గట్టి బందోబస్తు..
ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 17 మంది ఎస్‌ఐలు, 350 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆలయ ఆవరణలో 22 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సమావేశంలో సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ శంషోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.