
పెరుగుతున్న ఆదరణ
రెండేళ్ల క్రితం బాక్స్ క్రికెట్ కోర్టును ఏర్పాటు చేశాం. మొదట్లో కొన్ని నెలలు చాలా తక్కువ మంది వచ్చేవారు. ఆరేడు నెలలుగా బాక్స్ క్రికెట్‌కు మంచి స్పందన ఉంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి ఆడేందుకు ఇష్టపడుతున్నారు. వేసవిలో, వీకెండ్స్ సెలవు రోజుల్లో ఎక్కువ మంది వస్తున్నారు.
– షేక్ వజాహత్ అలీ, బ్రదర్ హుడ్ బాక్స్ క్రికెట్ ఏరినా, నిర్వాహకుడు
వారంలో ఒకసారి క్రికెట్ ఆడుతా..
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడానికి తీరిక లేకుండా పోయింది. అయితే జిల్లాకేంద్రంలో బాక్స్ క్రికెట్ కోర్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి సమయం చూసుకొని క్రికెట్ ఆడుతాను. ఫిట్‌నెస్ కోసం వారంలో ఒకసారి బాక్స్ క్రికెట్ ఆడుతా. – ఇంతియాజ్ ఇసాక్,
రాష్ట్ర ఎంఎఫ్‌సీ మాజీ చైర్మన్, మహబూబ్‌నగర్
ఫిట్‌నెస్ కోసం..
ఫిట్‌నెస్ కోసం స్నేహితులతో కలిసి బాక్స్ క్రికెట్ ఆడుతాం. ఏడాదిన్నర నుంచి వీకెండ్స్, సెలవుల్లో బాక్స్ క్రికెట్ ఆడుతాం. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బాక్స్ క్రికెట్‌లో ఆడుతుంటే చాలా సరదాగా ఉంటుంది. పని ఒత్తిడి ఉండే మాకు ఈ బాక్స్ క్రికెట్ ఆడితే ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది.
– రాజేష్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, మహబూబ్‌నగర్
సౌకర్యంగా ఉంది..
స్నేహితుల మధ్య అనుబంధానికి బాక్స్ క్రికెట్ ఒక వేదికలా నిలుస్తుంది. ఎంత బిజీగా ఉన్న వారంలో రెండుసార్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బాక్స్ క్రికెట్ ఆడుతాం. చిన్నపాటి మైదానంలో ఎక్కువ దూరం పరుగెత్తాల్సిన అవసరం ఉండదు. బ్యాటింగ్, బౌలింగ్ చేయడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అందువల్ల బాక్స్ క్రికెట్ ఆడటానికి నేను ఎక్కువ ఆసక్తి కనబరుస్తాను.
– ఎండీ రియాజ్, ఐటీ ఉద్యోగి, మహబూబ్‌నగర్

పెరుగుతున్న ఆదరణ

పెరుగుతున్న ఆదరణ

పెరుగుతున్న ఆదరణ