
అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే..
ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించాలనే లక్ష్యంతో ఈ తల్లి పాల బ్యాంకు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ఎంతో మంది తల్లిలేని పిల్లలు, పాలు సక్రమంగా ఉత్పత్తి కానీ తల్లులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో పాలు ఉత్పత్తి కానీ తల్లులు ధాత్రి పాల బ్యాంకు ఉపయోగించుకోవాలి. పాలు ఉత్పత్తి చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం పాటు సేకరించిన పాలకు అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాత చిన్నారులకు అందిస్తాం. – రమేష్ లక్కర్స్,
పాల బ్యాంకు ప్రోగ్రామ్ అధికారి
నవజాత శిశువులకు మేలు..
చాలా మంది బాలింతలు, తల్లులకు హార్మోన్లతో పాటు అనారోగ్య సమస్యల వల్ల పాలు ఉత్పత్తి జరగవు. అలాగే నెలల నిండకముందే ప్రసవం అయిన తల్లులకు సైతం పాలు సకాలంలో రావు. ఇలాంటి వారి కోసం పాల బ్యాంకు నుంచి తల్లిపాలు సేకరించి అందిస్తాం. ఇది నవజాత చిన్నారులకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. ప్రతి శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్పత్రిలో నేడు ప్రారంభం చేయడానికి కలెక్టర్ విజయేందిర, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతారు. – డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్,
జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
●

అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే..