
స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ చౌరస్తాలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ణగారిన వర్గాలలో ఉన్న దివ్యాంగులు అధికారం కలిగిన సంస్థల్లో భాగం కావడానికి చట్టపర అధికారాలతో స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దివ్యాంగులందరూ అందరూ ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్‌ను ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త యాదగిరి, జాతీయ ఉపాధ్యక్షుడు కుమార్, నాయకులు హరీశ్‌కుమార్, దేవేందర్ ప్రసాద్, విజయ్, రామకృష్ణారెడ్డి, బాలపీర్, భీమ్‌సాగర్, మంగమ్మ, వెంకటయ్య, మధురాజు, జనార్దన్, సుదర్శన్, నారాయణమ్మ పాల్గొన్నారు.