‘పది’ పరీక్షలపై సమీక్ష
మంచిర్యాలఅర్బన్: స్థానిక సైన్స్ సెంటర్‌లో పదో తరగతి పరీక్షలపై డీఈవో యాదయ్య శుక్రవారం సమీక్షించారు. హాజీపూర్, భీమా రం, నస్పూర్, చెన్నూర్, దండేపల్లి, మందమర్రి, జైపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాల ప్రభుత్వ, కేజీబీవీ, ఎయిడెడ్, టీజీఎంఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే సిలబస్ పూర్తి చేసినందుకు శనివారం నుంచి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని సూచించారు. వందశాతం ఫలితాల సాధనకు ప్రణాళికలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. ప్రతీ యూనిట్ స్లిప్ టెస్ట్ నిర్వహిస్తూ విద్యార్థులతో మరింత సాధన చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీజీఈ దామోదర్‌రావు, డీసీఈబీ కార్యదర్శి భీంరావు, సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, డీసీఈబీ సహాయ కార్యదర్శి కుమారస్వామి, ఎంఈవోలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment