ఆస్పత్రిలో మహిళ మృతిపై ఆందోళన
మంచిర్యాలక్రైం: మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్లో ఉ న్న ప్రైవేటు ఆస్పత్రిలో మహిళ మృతిపై కు టుంబ సభ్యులు ఆందో ళనకు దిగారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన ముత్తె రాజేశ్వరి(55) గురువారం అస్వస్థతకు గురి కాగా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెకు స్టెంట్లు వేయాలని చెప్పగా.. రూ. 1.50లక్షలు చెల్లించారు. రాత్రికి రెండు స్టెంట్లు వేసినట్లు చెప్పిన వైద్యులు శుక్రవారం వరకు ఐసీలో ఉంటుందని, ఎవరూ వెళ్లొద్దని తెలిపా రు. శుక్రవారం చనిపోయినట్లు చెప్పడంతో ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగా రు. వైద్యం వికటించి చనిపోయిందని ఆరోపించారు. ఆస్పత్రి వైద్యుడు వికాస్‌ను సంప్రదించగా.. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకొచ్చారని, అ యినా తమ ప్రయత్నం చేశామని, నిర్లక్ష్యం లేదని తెలిపారు. ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్థానిక సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment