బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ్యూల్
మంచిర్యాలఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ్యూల్ కోరారు. మంచిర్యాలలో డీటీఎఫ్ జిల్లా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా సామ్యూల్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పీఆర్‌సీ, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తె లిపారు. రిటైర్ అవుతున్న టీచర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక..
డీటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమేశ్, ఉపాధ్యక్షుడిగా కుమార్, ప్రధాన కార్యదర్శిగా జయకృష్ణ, జిల్లా కార్యదర్శులుగా ప్రకాశ్, కళావతి, అప్పారావు, సురేశ్, రాష్ట్ర కౌన్సిలర్లుగా జాకీర్‌హుస్సెన్, సంతోష్, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా విష్ణువర్థన్, సభ్యులుగా శ్రీనివాస్, రాజన్న ఎన్నికయ్యారు. సమావేశంలో సీనియర్ నాయకులు కొండయ్య, సత్యనారాయణ, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment