
సహజ హోలీ.. సంతోషాల కేళి
● ఇప్పటికీ మోదుగుపూల రంగులే వాడుతున్న ఆదివాసీలు ● రసాయనాలతో ముప్పు
అడవులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీలు జరుపుకునే ప్రతీ పండుగకు ప్రత్యేక చరిత్ర ఉంటుంది. అందరిలా కాకుండా వారంతా ప్రత్యేకంగా వైవిధ్యంగా పండుగలు జరుపుకుంటారు. శుక్రవారం హోలీ పండుగను కూడా ప్రత్యేకంగా జరుపుకునేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. హోలీ వేడుకల్లో ప్రత్యేకంగా మోదుగుపూలతో తయారు చేసిన రంగులతో రంగోలి ఆడడం ఆనవాయితీగా వస్తోంది. రేపు శుక్రవారం సంబరాలకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమయ్యారు. వేడుకల్లో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయన పూరిత రంగులు ఆరోగ్యానికి హానికరమని, సహజ సిద్ధమైన రంగులు వాడడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. – కెరమెరి/నిర్మల్‌చైన్‌గేట్/నిర్మల్‌ఖిల్లా
కుడుకలు ఇస్తే లెక్క
మార్పుకోసం కృషి
రసాయన రంగులు మానుకోవాలి. ప్రకృతిలో దొరికే పూలు, ఆకులతో తయారయ్యే రంగులను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తద్వారా పర్యావరణాన్ని కాపాడినట్టే. ఇదే విషయం మా పాఠశాల విద్యార్థులకు అర్థమయ్యేలా చెబుతున్నా. వారితో స్వయంగా సహజసిద్ధమైన రంగులు తయారు చేసే విధానం నేర్పిస్తున్నా. – వీఎస్ శ్రీనివాస్, ఎంపీపీఎస్
వెంకటాపూర్, మామడ, నిర్మల్
రసాయన రంగులతో ముప్పు
రసాయన రంగులతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో మంట, దురద వస్తాయి. రంగుల నుంచి వచ్చే పొగ పీల్చుకోవడం ద్వారా ఊపిరితిత్తుల సమస్యలతో పాటు శ్వాస సంబంధిత వ్యాధుల ముప్పు ఉంటుంది.
– డాక్టర్ రత్నాకర్, ఫిజీషియన్, నిర్మల్
కృత్రిమ రసాయనాలతో ప్రమాదం
రంగులు ఏవైనా కళ్లల్లో పడకుండా జాగ్రత్త పడాలి. హానికర రసాయనాలతో కూడిన రంగులతో రెటినా దెబ్బతినే ప్రమాదం ఉంది. అల్సర్లు, పుండ్లు ఏర్పడి శాశ్వతంగా కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంది.
– సురేశ్, కంటి వైద్యనిపుణుడు, నిర్మల్
తాతాలకాలం నుంచి..
మోదుగ పూలతో రంగులు తయారు చేసుకుని చల్లుకోవడం తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. ఇప్పటికీ మేము ఇదే ఆచారాన్ని పాటిస్తున్నాం. ఎన్ని రంగులు బయట నుంచి తీసుకవచ్చినా మోదుగు పూ లతో తయారు చేసిన రంగులతో సరిపోవు.
– సెడ్మకి దుర్పతబాయి, మాజీ జెడ్పీటీసీ
పూర్వీకుల నుంచి..
ఉట్నూర్‌రూరల్/ఇంద్రవెల్లి: మా చిన్నతనం నుంచి హోలి పండుగ వచ్చిందంటే ప్రకృతి ప్రసాదించిన మోదుగ పూలతోనే రంగులు ఆడుతాం.. తెల్లవారు జామున నిద్రలేచి అడవికి వెళ్లి పూలు తెచ్చి రంగులు తయారు చేస్తాం. మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం.
– పెందూర్ చందు, సమాక, ఇంద్రవెల్లి
రాబోయే తరానికి..
ఉట్నూర్‌రూరల్/ఇంద్రవెల్లి: మార్కెట్లో లభించే రంగులు వాడితే అనేక రోగాలు వస్తాయని, అవి వాడవద్దని, అడవిలో లభించే మోదుగు పూలతో తయారు చేసిన రంగులనే వాడాలని మాపిల్లలకు నేర్పిస్తున్నాం. రాబోయే తరానికి కూడా నేర్పిస్తున్నాం.
– భీంరావు, సమాక, ఇంద్రవెల్లి
పూలతో నిండుగా ఉన్న మోదుగు చెట్టు
అనాదిగా వస్తున్న ఆచారం
ఆదివాసీలు ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తున్నారు. అనేక పండుగలను వైవిద్యంగా జరుపుకుంటున్నప్పటికి ఈ హోలి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గతంలో బయట మార్కెట్లో ఎక్కడ కూడా అనుకున్న విధంగా రంగులు లభించేవి కాదు. అందుకు వీరంతా ప్రకృతి ప్రసాదించిన మోదుగు పూలనే రంగులకు వాడుకునేవారు. ఈ పూలు మార్చి నెలలో మాత్రమే ఉంటాయి.
రంగుల తయారీ ఇలా..
హోలీకి ఒక రోజు ముందు మోదుగ పూలను తీసుకువచ్చి నీటిలో నానబెడతారు. తెల్లవారు జామున రోట్లో వేసి రోకలితో దంచుతారు. లేదా గ్రైండింగ్ చేస్తారు. ఆతర్వాత నీటిలో కలిపి హోలీ ఆడుతారు.
సహజ రంగులైతే మేలు..
సహజ సిద్ధమైన రంగులు వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో వివిధ రకాలైన రంగులను తయారు చేసుకోవచ్చు. వీటితో ఎలాంటి హాని జరగదు. దానిమ్మ, టమాటతో ఎరుపు రంగు, మోదుగుపూలు, క్యారెట్‌తో ఆరెంజ్ రంగు, బీట్ రూట్ ఊదారంగు, ఆకు కూరలతో ఆకుపచ్చ రంగు, పసుపు కొమ్ములతో పసుపు రంగు ఇలా సహజ సిద్ధమైన రంగులను తయారు చేసుకోవచ్చు.
తాతమ్మ నేర్పిన మార్గంలోనే...
నిర్మల్‌ఖిల్లా: మోదుగ పూలు ఆరోగ్యరీత్యా పలు సుగుణాలు కలిగి ఉన్నాయి. నేను చిన్నప్పుడు దుకాణాల్లో కొనుగోలు చేసిన రంగులను వినియోగించే సందర్భంలో మా తాతమ్మ వాటికి బదులుగా మోదుగు పూలను తెచ్చి నానబెట్టి ఉడికించిన తర్వాత చేసిన కాషాయవర్ణపు సహజ సిద్ధ రంగులను వినియోగించమని ప్రోత్సహించేది. అలా నాకు దీని తయారీ అలవాటైంది. ఇప్పటికీ నా పిల్లలకు ఇదే సంప్రదాయాన్ని నేర్పిస్తూ కొనసాగిస్తున్నా.
– నల్ల మన్మోహన్‌రెడ్డి, సేంద్రియ రైతు, చించోలి(బి), నిర్మల్
● రంగుల్లో పాదరసం, సిలికా, మైకా, సీసం, వంటి వివిధ రకాల రసాయనాలు కలుపుతారు. ఇవి చర్మానికి, కళ్లకు, శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
● రంగుల పొడి చల్లినప్పుడు అవి గాలిలో కలిసి పోయి నోటిలోకి, శ్వాసనాళాల్లోకి వెళ్లి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. గాలి పీల్చినప్పుడు ఈ రంగులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అస్తమా, ఎలర్జీ ఏర్పడే అవకాశం ఉంటుంది.
● రసాయన రంగులతో శరీరం దురద, మంట, నొప్పి కలుగుతుంది. కళ్లలో రంగులు పడితే కంటి పొరలు దెబ్బతినే అవకాశం ఉంది.
● రంగులు నోట్లోకి వెళ్తే వాంతులు, విరోచనాలు అవుతాయి. కడుపునొప్పి వస్తుంది.
● నలుపురంగులో లెడ్ ఆకై ్సడ్‌తో మూత్రపిండాల వైఫల్యాలకు దారితీస్తుంది.
● కృత్రిమ ఆకుపచ్చ రంగుతో కాపర్ సల్ఫేట్ కంటి దురద, వాపు వైఫల్యాలకు దారితీస్తుంది.
● వెండి రంగు అల్యూమినియం బ్రోమైడ్ క్యాన్సర్ కారకం.
● నీలి రంగు చర్మ సంబంధ వ్యాధులు, మెర్క్యూరీ సల్ఫేట్ (ఎరువు) క్యాన్సర్‌కు కారణమవుతుంది.
● పౌడర్లు, గులాల్, లెడ్, బ్రోమియం, నికెల్, మెర్క్యురీ, కాపర్, జింక్, వినిడికి లోపం, ఎలర్జీ, ఆయాసం మొదలగు దుష్ఫలితాలకు దారితీస్తాయి.
రసాయన రంగులతో ప్రమాదం..
కెరమెరి/ఇంద్రవెల్లి: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయం ప్రకారం హోలీకి ముందురోజు గ్రామ పటేల్, దేవారికి గ్రామస్తులంతా కుడుకలు ఇస్తా రు. ఇలా కుడుకలు ఇచ్చిన వారే గ్రామస్తులుగా పరిగణించబడుతారు. గ్రామంలో ఉండి కూడా కుడుకలు ఇవ్వని వారికి గ్రామంతో సంబంధం లేదని గుర్తిస్తారు. ఈ కార్యమంతా కాముని దహ నం రోజు జరుగుతుంది. గురువారం సాయంత్రం జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఈ ఆచారం కొనసాగుతుంది. కుడుకలతో పాటు చక్కెర బిళ్లలు గ్రామ పటేల్, దేవారికి అందజేస్తారు. అనంతరం వాటిని లెక్కిస్తారు. వాటి ప్రకారం గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వాటికి సమానంగా కుడుకలు, పేర్లు వచ్చాయో లేదో పరిశీలిస్తారు.
పులారా అలంకరణ
వెదురు కర్రలతో రెండు పులారాలను తయారు చేస్తారు. వాటికి ఐదుచోట్ల కుడుకలు, గారెలు, గోగుపూలు, చక్కెర బిళ్లలు, వంకాయ అమరుస్తారు. అనంతరం గ్రామ పొలిమేర వరకు డోలు, సన్నాయిలతో తరలివెళ్లి కాముని దహనం చేస్తా రు. అనంతరం రెండు వెదుర్లకు వృద్ధుడు, వృద్ధురాలు అని నామం పెట్టి ఆ పులారాలను కడుతా రు. కిందిభాగంలో మంట అంటిస్తారు. ఆ తర్వా త ఆ మంట పై నుంచి వరుసగా కొందరు దూకుతారు. అనంతరం గ్రామంలోని ప్రతీ కుటుంబం నుంచి రొట్టెలు, పప్పులు తీసుకువచ్చి కాముని దహనం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఆతర్వాత సహపంక్తి భోజనం చేస్తారు. కాముడిని దహనం చేసిన చోటే రాత్రంతా బస చేస్తారు.
కేరింతలకూ..చరిత్ర!
హోలీ రోజు ప్రతీ గ్రామంలో రంగులు చల్లుకుంటారు. కానీ ఆదివాసీ గిరిజనుల మాత్రం అందుకు కొంత భిన్నంగా ఉంటారు. రంగులు చల్లుకోవడంతో పాటుగా డోలు వాయిస్తూ.. జాజిరి ..జాజిరి.. బోబోబోబో.. అంటూ కేరింతలు పెడతారు. రావణాసురునిపై శ్రీరాముడు బాణం విసిరినప్పుడు అది తప్పిపోవడంతో రావణ సైన్యం అలాగే కేరింతలు పెట్టిందని, రావణుడు మరణించాక ఆ ఆనందంలో రాముని సైన్యం ఇలా తిరిగి కేరింతలు పెడుతూ ఉత్సాహంగా జరుపుకుంటారు. దానికి ప్రతీకగా ఈ కేరింతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పటేళ్లు చెబుతున్నారు.
బూడిదకు అత్యంత ప్రాధాన్యం
కాముడి దహనం తర్వాత అట్టి బూడిదను ఆది వాసీ సంప్రదాయం ప్రకారం ఇళ్ల ముఖద్వారాల వద్ద గీత వేస్తారు. అలా వేస్తే ఎలాంటి దుష్టశక్తులు తమ ఇళ్లకు రావని ఆదివాసీల నమ్మకం. అంతేకాకుండా దండారీ ఉత్సవాల్లో కాముడి బూడిదకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. గుస్సాడీ వేషధారణలో ఈ బూడిదను ఉపయోగిస్తారు.
నేడు పులారా.. రేపు దురాడి
సంప్రదాయబద్ధంగా కాముడి దహనం
డోలు, బాజాలతో తరలివెళ్లనున్న ఆదివాసీలు
కామున్ని దహనం చేసిన చోటే రాత్రంతా బస
పాటించాల్సిన జాగ్రత్తలు
చర్మానికి రంగులు పట్టుకోకుండా ముందస్తుగా ఆవాల నూనె, జెల్లీని రాసుకోవాలి.
కళ్లకు అద్దాలు పెట్టుకుంటే రంగునీళ్లు కళ్లలో పడకుండా ఉంటాయి.
హోలీ ఆడిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే చేతి గోర్ల నుంచి రంగులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
తాత, ముత్తాతల నుంచి..
మాతాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారమిది. అన్ని గ్రామాల్లోని ఆదివాసీలు ఈ పండుగలకు అతీతులే. ప్రతిఒక్కరూ ఈ ఆచారాన్ని పాటించాల్సించే. కానీ హోలి, దురాడి కార్యక్రమాల్లో మహిళలు అంతగా పాల్గొనరు. ఎక్కువగా ఈ కార్యక్రమాలను పురుషులు మాత్రమే జరుపుకుంటారు.
– రాధాబాయి, చౌపన్‌గూడ
అన్ని పండుగలకు భిన్నంగా..
అన్ని పండుగలకంటే హోలి, దురాడి చాలా భిన్నంగా జరుపుకుంటాం. అంతా ఒక్కటై కాముని పున్నమిని జరుపుకుంటాం. కుడుకల ఆచారం చాలా ముఖ్యం. గ్రామ పటేల్‌కు కుడుకలు ఇస్తేనే ఆ గ్రామంలో ఉన్నట్టు. లేదంటే లేనట్టే. కాముని దహనం తర్వాత అక్కడే బస చేస్తాం.
– దంబీరావు, గ్రామ పటేల్, చిన్న సాకడ

సహజ హోలీ.. సంతోషాల కేళి

సహజ హోలీ.. సంతోషాల కేళి

సహజ హోలీ.. సంతోషాల కేళి

సహజ హోలీ.. సంతోషాల కేళి

సహజ హోలీ.. సంతోషాల కేళి

సహజ హోలీ.. సంతోషాల కేళి

సహజ హోలీ.. సంతోషాల కేళి

సహజ హోలీ.. సంతోషాల కేళి

సహజ హోలీ.. సంతోషాల కేళి

సహజ హోలీ.. సంతోషాల కేళి

సహజ హోలీ.. సంతోషాల కేళి
Comments
Please login to add a commentAdd a comment