బైక్‌లు ఢీకొని ఒకరికి గాయాలు
కడెం: మండల కేంద్రంలోని ఎస్‌బీఐ సమీపంలో బుధవారం రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు దస్తురాబాద్ మండలం మున్యాల్‌కు చెందిన ఇద్దరు యువకులు ఇంటర్ పరీక్షలు రాసేందుకు ద్విచక్ర వాహనంపై కడెం వస్తుండగా ఽఎస్‌బీఐ బ్యాంక్ వైపు నుంచి బైక్‌పై వస్తున్న ధర్మాజీపేట్ గ్రామానికి ఎల్ల య్య బైక్‌ను ఢీకొట్టారు. ఘటనలో ఎల్లయ్య కాలుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు.
బావిలోపడి యువకుడు మృతి
కౌటాల: ప్రమాదవశాత్తు బావిలోపడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మొగడ్‌దగడ్‌కు చెందిన ఉ ర్వత్ దౌలత్ (26) కొంతకాలంగా మద్యానికి బానిసై మతిస్థిమితం కోల్పోయాడు. మంగళవారం మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం గ్రామ శివారులోని బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తల్లి నిర్మలబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment