సింగరేణి కార్మికుల పింఛన్ పెంచాలి
శ్రీరాంపూర్: బొగ్గుగని రిటైర్డు కార్మికులకు ఇ ప్పుడిస్తున్న పింఛన్ ఏమాత్రం సరిపోవడం లే దని, పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లోకసభ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఆ యన ప్రశ్నోత్తరాల సమయంలో రిటైర్డు కార్మి కుల పింఛన్ సమస్యపై మాట్లాడారు. 35ఏళ్ల క్రి తం కాక వెంకటస్వామి బొగ్గుగని కార్మికులకు పింఛన్ హక్కు కల్పించారని, అప్పటి నుంచి పెంచలేదని, రూ.1500 మాత్రమే ఇప్పటికీ పొందుతున్నారని అన్నారు. సింగరేణి కార్మికులు తెలంగాణ కోసం కొట్లాడారని, దేశం కో సం వెలుగు ఇస్తున్న కార్మికుల జీవితం ఉద్యోగ విరమణ తర్వాత చీకట్లో మగ్గుతోందని తెలి పారు. దశాబ్దాల క్రితం నిర్ణయించిన పింఛన్ ఇప్పుడెలా సరిపోతుందని, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment