ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో ట్రాఫిక్ సమస్య పరి ష్కారానికి తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని మెయిన్ బజార్, అంబేడ్కర్ చౌర స్తా ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌరస్తాతోపాటు మెయిన్ రోడ్డు, ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్ చేయరాదని అ న్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఐదు మీటర్ల దూరం వరకు ఎలాంటి వాహనాలు పా ర్కింగ్ చేయకుండా చూడాలని వన్‌టౌన్ ఎస్ హెచ్‌వో దేవయ్యను ఆదేశించారు. అనంతరం వన్‌టౌన్, టూటౌన్ పోలీసుస్టేషన్లను సందర్శించి రికార్డులు పరిశీలించారు. బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్, వన్‌టౌన్ ఎస్సై నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment