మిషన్ భగీరథ నీరందించేలా చర్యలు
చెన్నూర్‌రూరల్: ‘బావురుమంటోన్న బావురావుపేట’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించారు. బుధవారం మండలంలోని బావురావుపేట గ్రామంలో ఎస్టీ కాలనీని సందర్శించారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యపై అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి మిష న్ భగీరథ నీరు రెండు పూటల సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని డీఈ విద్యాసాగర్ తెలిపా రు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సరిత, పంచాయతీ కార్యదర్శి రమణ పాల్గొన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘సాక్షి’కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
మిషన్ భగీరథ నీరందించేలా చర్యలు
Comments
Please login to add a commentAdd a comment