● సులభ బోధన కోసమే వినియోగం ● జిల్లాలో ఆరు పాఠశాలల్లో అమ
ఆరు పాఠశాలలు ఎంపిక
జిల్లాలో ఏఐ ఆధారిత బోధనకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఆరు పాఠశాలలు ఎంపికయ్యా యి. సర్కారు బడిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేస్తారు. కంప్యూటర్లలో పొందుపరిచిన సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేస్తా రు. కృత్రిమ మేధస్సు సహకారంతో విద్యార్థులు చదవడం, రాయడం విధానంలో పొరపాట్లను మదింపు చేసి విద్యార్థులకు వివరిస్తుంది. ఏఐ బోధన అమలుపై జిల్లా నుంచి నలుగురు రిసోర్స్‌పర్సన్లు శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. త్వరలోనే ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు అమలులోకి రానున్నాయి.
– యాదయ్య, జిల్లా విద్యాధికారి
రిసోర్స్ పర్సన్లకు శిక్షణ
జిల్లా నుంచి ఏఐ బోధన అమలుపై నలుగు రు సభ్యులతో కూడిన బృందానికి అవగాహన కల్పించారు. బృందంలో సెక్టోరియల్ అధికారి, ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఎస్జీటీలను రిసోర్స్‌పర్సన్లుగా నియమించారు. వీరందరికీ మంగళవారం హైదరాబా ద్‌లో కృత్రిమ మేధపై శిక్షణ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్, అప్‌డేట్ చేయడం, కంప్యూటర్లలో పొందపరిచిన సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం, ఏఐ బోధన సమగ్రవంతంగా అమలు, తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన బృంద సభ్యులు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో టీచర్లకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ పర్యవేక్షించనున్నారు.
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే డిజిటల్ నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) బోధన అందుబాటులోకి తెస్తోంది. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆరు పాఠశాలల ను ఇందుకు ఎంపిక చేశారు. ఎంపికై న పాఠశాలల్లో విద్యార్థులకు ఏఐ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు చేప్పేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యంగా ఏఐ బోధన సాగనుంది. ఎఫ్‌ఎల్‌ఎన్‌కు సాంకేతికత జోడించి విద్యార్థుల్లో స్వీ య ప్రేరణ కలిగించి అభ్యసన అనుకూల పరిస్థితి కల్పించేందుకు ఏఐ బోధన వారం చివరలో ప్రారంభించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.
ఆరు పాఠశాలల్లో అమలు
విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృతిమ మేధ స్సు సహకారం తీసుకోవాలని అధికారులు నిర్ణయించి తగిన కసరత్తు పూర్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన అమలుకు జిల్లాలో ఆరు పాఠశాలలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఇందులో ఎంపీపీఎస్ వెంకట్రావ్‌పేట్, ఎంపీపీఎస్ రా పల్లి, ఎంపీపీఎస్ ముడిమడుగు, ఎంపీపీఎస్ ఏపీ వాడ చెన్నూర్, ఎంపీపీఎస్ దుగ్నేపల్లి, ఎంపీపీఎస్ చాకెపల్లి పాఠశాలలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలకు ఐదు కంప్యూటర్లను విద్యాశాఖ అధికారులు సమకూర్చాల్సి ఉంది. విద్యార్థులు తెలుగు, ఆంగ్లం బాగా చదివి.. రాసేలా, గణిత అంశాల్లో పట్టు సాధించేందుకు కృతిమ మేధ బోధన దోహదపడనుంది. ప్రతీ పాఠశాలలో 3వ తరగతి నుంచి 5వ తరగతిలో వెనుకబడిన 10మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వారంలో 80నిమిషాల పాటు కేటాయించిన టైంటేబుల్ ప్రకారం ఏఐ బోధన సాగనుంది. తెలుగు, ఆంగ్లం, గణితంపై ప్రతీ విద్యార్థి కంప్యూటర్ మీద సాధన చేయాల్సి ఉంటుంది. ప్రతీ సాధన రికార్డు కానుంది. దీంతో విద్యార్థుల ప్రగతి అంచనా వేయడం సులభతరం కానుంది. ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను రూపొందిస్తారు. ప్రధాన సర్వర్ల నుంచి ఆయా స్కూళ్లకు వీటిని అనుసంధానం చేస్తారు. టీచర్ ఒక పాఠం చెప్పిన తర్వాత ఏఐ ఆధారిత ప్రశ్నలు గూగుల్ క్రోం ద్వారా విద్యార్థులకు పంపిస్తారు. వీటికి ఆన్‌లైన్‌లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్‌పై వచ్చే వాక్యం(సెంటెన్స్) తప్పుగా అభ్యసనం చేసినప్పుడు సరిద్దిద్దుకునే వీలు కలుగనుంది. దీంతో విద్యార్థులు మళ్లీ ఆ తప్పు చేయకుండా ముందుకు వెళ్లేలా భయం లేకుండా సొంతంగా నేర్చుకునేందుకు వీలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment