చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం

Published Thu, Mar 13 2025 12:09 AM | Last Updated on Thu, Mar 13 2025 12:08 AM

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం

● ప్రజల భఽద్రత, బాధ్యత పోలీసులదే.. ● రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబార్‌ కిషోర్‌ ఝూ
కరెంటు లేని బడికి రూ.23వేలు బిల్లు

మంచిర్యాలక్రైం: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బుధవారం మంచిర్యాల పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పెండింగ్‌ కేసులు, అధికంగా నేరాలు జరుగుతున్న తీరు, రౌడీషీటర్ల బైండోవర్‌, కౌన్సెలింగ్‌ తదితర విషయాలపై అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసులు, ఎఫ్‌ఐఆర్‌ రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, బాధ్యత పోలీసులదేనని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసు బాధితులకు మాత్రమేనని, నేరస్తులకు కాదని స్పష్టం చేశారు. అంతకుముందు డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ప్రకాష్‌ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ నరేష్‌కుమార్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

మంచిర్యాలక్రైం: పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా హెచ్చరించారు. బుధవారం రామగుండం కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పెట్రోకార్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో ఒక బృందంగా పని చేసినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తామని, ఫిట్‌నెస్‌ కలిగి క్రమశిక్షణతో ఎదుటివారికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. నేరాల నియంత్రణలో బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ అ ధికారుల పాత్ర కీలకమని, 24గంటలు అప్రమత్తంగా ఉండాలని, డయల్‌ 100కు ఫోన్‌ రాగానే నిర్ణీత సమయంలో సంఘటన స్థలానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించాలని సూ చించారు. ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్‌ఏసీపీ ప్రతాప్‌, సీఐలు, ఎస్సైలు, వర్టికల్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement