రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
బెల్లంపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులు, మందుల నిల్వ, ల్యాబ్, రిజిష్టర్లు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఐటీఐ ఏర్పాటు కోసం పలు చోట్ల స్థల పరిశీలన చేశారు. బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ జ్యోత్స్న, సిబ్బంది పాల్గొన్నారు.
సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ కుమార్ దీపక్
Comments
Please login to add a commentAdd a comment