కోల్ కంట్రోల్ అధికారుల తనిఖీ
శ్రీరాంపూర్: సెంట్రల్ కోల్ కంట్రోల్ అధికారులు బుధవారం శ్రీరాంపూర్‌లో మూసివేసిన ఆర్కే8 గనిని తనిఖీ చేశారు. ఆ శాఖ నాగపూర్ రీజియన్ ఓఎస్‌డీ సందీప్ ఎస్ పరాంజ పే, కొత్తగూడెం రీజియన్ ఓఎస్‌డీ డీవీ సుబ్రమణ్యం ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్‌తో కలిసి గని మూసి వేసిన తర్వాత తీసుకున్న పర్యావరణ పరిరక్షణ చర్యలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. భూసార పరిరక్షణ ఏ విధంగా చేశారు, పచ్చదనం పెంపులో భాగంగా నాటిన మొక్కలు, గని మ్యాన్‌వే, ఇతర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా వేసిన కంచెను పరిశీలించారు. ఏరియా ఎస్‌ఓటు జీఎం యన్.సత్యనారాయణ, గ్రూప్ ఏజెంట్ కే.రాజేందర్, ఎన్వి రాన్‌మెంట్ అడిషనల్ మేనేజర్ వీ.తిరుపతి, ఆర్కే 7గని మేనేజర్ ఈ.తిరుపతి, అధికారులు శేఖర్, వరలక్ష్మీ, చంద్రమణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment