సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి
చెన్నూర్: చెన్నూర్ ప్రాంత ప్రజలు ఆరోగ్య కేంద్రంలోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వార్డుల్లో పర్యటించి వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం క్షయ వ్యాధిని గుర్తించే మాలిక్యుర్ యంత్రాన్ని ప్రారంభించి, డయాలసిస్ దినోత్సవం సందర్భంగా వైద్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సత్యనారాయణ, డీపీసీ సురేందర్, ఎస్‌టీఎస్ అశోక్, ఎస్‌టీఎల్‌ఎస్ వేణు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment