బొగ్గు గనుల వేలం రద్దు చేయాలి
శ్రీరాంపూర్: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్రం చేపట్టిన వేలం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నా యకులు డిమాండ్ చేశారు. గురువారం యూ నియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కు మారస్వామి, రీజియన్ అధ్యక్షుడు సమ్ము రాజ య్య ఆర్కే 7గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. బొగ్గు గనుల వేలం వల్ల సింగరే ణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అ న్నారు. ఇప్పటివరకు గనులన్నీ సింగరేణికే కే టాయించారని, నేడు ప్రైవేట్ సంస్థలకు ధారా దత్తం చేయడం కోసం వేలం ప్రక్రియ మొదలుపెట్టారని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే వేలాన్ని అడ్డుకోవాలని కా ర్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైపాల్‌సింగ్, నా యకులు చంద్రయ్య, భీరయ్య, పోగుల శేఖర్, ఉదయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment