సహజసిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవాలి
బెల్లంపల్లి: సహజ సిద్ధమైన రంగులతో హోలీ పండుగ జరుపుకోవాలని పట్టణంలోని ప్రభు త్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ(సీవోఈ) విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. గురుకులం నుంచి పుర వీధుల మీదుగా మార్కెట్ కాంటా చౌ రస్తా వరకు ప్లకార్డులతో సాగింది. పీఎంశ్రీ స్కూల్, సీవోఈ క్లబ్ యాక్టివిటీలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీవోఈ ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్ మాట్లాడుతూ రసాయనిక రంగులు చల్లుకోవద్దని, రసాయనాలు కలిపిన రంగులు ప్రమాదకరమైన జబ్బులకు గురి చేస్తాయని వివరించారు. ప్రకృతిలో లభించే సహజ రంగుల వాడకానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమలాకర్, మల్లికార్జున్, మహేష్, శ్రీలత, రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment