కొత్త అధ్యాపకులు వచ్చారు..
● జూనియర్ కళాశాలల్లో చేరిక ● జిల్లాలో 26 పోస్టులు భర్తీ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని పది ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 28 ఖాళీలకు గాను 26మందిని నియమించింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత కాలేజీల్లో అధ్యాపకులు రిపోర్టు చేశారు. చెన్నూర్‌లో తెలుగు, కాసిపేటలో కామర్స్ సబ్జెక్టు లెక్చరర్లు మినహా మిగతా అన్ని సబ్జెక్టులకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ చేశారు.
పన్నెండేళ్ల తర్వాత..
పన్నెండేళ్ల క్రితం ఒప్పంద అధ్యాపకుల నియామకాలు నిలిచిపోయాయి. ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానాల్లో విశ్రాంత అధ్యాపకులు, అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను అతిథి అధ్యాపకులుగా నియమించారు. అప్పట్లో నెలకు రూ.10వేలు వేతం ఉండడంతో బోధనకు విముఖత చూపారు. తర్వాత కాలంలో పీరియడ్‌కు రూ.150 చొప్పున కనీస వే తనం రూ.21వేలకు మించకుండా ప్రభుత్వం అందజేసింది. కాలక్రమేణా పీరియడ్‌కు రూ.390కి పెంచి నెలకు రూ.28వేలకు మించకుండా ప్రతీయేటా రె న్యూవల్ చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇంటర్ బోర్డు నో టిఫికేషన్ విడుదల చేయడం, భర్తీలో పలు కారణాలతో ఆలస్యమైంది. చివరికి ఎంపిక చేసిన జాబి తాను ఇంటర్ బోర్డుకు అందజేసింది. మరో పది ఒకేషనల్ లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
భర్తీ ఇలా..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 28 పోస్టుల ఖాళీలకు గాను 26 మంది నియామకం అయ్యారు. జైపూర్ కళాశాలలో 3, మందమర్రిలో 5, మంచిర్యాలలో 3, జన్నారంలో 1, కాసిపేటలో 2, దండేపల్లిలో 1, బెల్లంపల్లిలో 3, బెలంపల్లి(బాయ్స్)లో 1, లక్సెట్టిపేట కళాశాలలో నలుగురు అధ్యాపకులు బాధ్యతలు చేపట్టారు. ఖాళీల భర్తీతో కళాశాలలు బలోపేతం అవుతాయని, ఉత్తీర్ణత శాతం, అడ్మిషన్లు పెరిగేందుకు దోహదపడుతుందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు విజిత్‌కుమార్ తెలిపారు.
సంతోషంగా ఉంది..
12 ఏళ్లుగా జేఎల్ రిక్రూట్‌మెంట్ జరగకపోవడంతో ఒత్తిడికి లోనయ్యాను. ప్రభు త్వ లెక్చరర్‌గా చే యాలన్నది నా లక్ష్యం. 2019లో టీజీటీ ఇంగ్లిష్‌గా ఉద్యోగం రావడంతో ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జైపూర్‌లో విధులు నిర్వహిస్తున్నాను. 2022 నోటిఫికేషన్ జారీ కావడం.. 2023 పరీక్ష రాశాం. 2024 ఫలి తాలు రావడంతో లెక్చరర్‌గా నియామక పత్రం అందుకోవడం సంతోషంగా ఉంది.
– కమలాకర్, నూతన లెక్చరర్, చెన్నూర్
కొత్త అధ్యాపకులు వచ్చారు..
Comments
Please login to add a commentAdd a comment