సంఘటన జరిగిన తక్షణమే స్పందించాలి
● నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● సీపీ అంబర్ కిషోర్ ఝూ
మంచిర్యాలక్రైం: ఏదైనా సంఘటన జరిగిన తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ అన్నారు. గురువారం రా మగుండం కమిషనరేట్ సమావేశ మందిరంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ఎస్సైలతో సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకున్నదని, ప్రతీ అధికారి వారి వ్యక్తిగత జీవి తానికి, తోటి సిబ్బంది జీవితాలకు విలువనివ్వాలని అన్నారు. సిబ్బందితో మాట్లాడి దర్బార్ వంటివి నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అధికారులు క్రమశిక్షణ, నిబద్ధతతో కష్టపడి సరైన మార్గంలో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఒంటరిగా కాకుండా ఇద్దరు ముగ్గురు తక్షణమే ఘటన స్థలానికి చేరుకుంటే విలువైన సమాచారం లభిస్తుందని తెలిపారు.
సంప్రదాయ పద్ధతిలో హోలీ జరుపుకోవాలి
సంప్రదాయ పద్ధతిలో హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ అంబర్ కిషోర్ ఝూ అ న్నారు. హోలీ వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని పోలీస్ అధికా రులను ఆదేశించారు. హోలీ పండుగకు సహజ సిద్ధమైన రంగులు వినియోగించాలని అన్నారు. మ ద్యం సేవించి సంబరాలు చేసుకోవద్దని, స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని వాగులు, బావులకు వె ళ్లకూడదని తెలిపారు. మద్యంమత్తులో మహిళలపై రంగులు చల్లడం, మోటారుసైకిళ్లపై అల్లర్లు చేయ డం, గుంపులు గుంపులుగా తిరిగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment