ఓటరు జాబితా సిద్ధం చేయాలి
● రాష్ట్ర ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: గుర్తింపు పొందిన రాజకీ య పార్టీల సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లే కుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాల ని రాష్ట్ర ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జి ల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఓటర్ల జాబి తా రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ నెల 19లోగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటరు జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ అంశాలపై సమావేశాలు నిర్వహించాలని తెలిపా రు. వీడియో, ఫొటోలు కవరేజ్ చేయాలని, రిజిష్ట ర్లు నిర్వహించాలని తెలిపారు. పార్టీల ప్రతినిధులకు ఓటరు జాబితా సంబంధిత దరఖాస్తు ఫారా లు 6, 7, 8పై వివరించాలని, నూతన ఓటరు నమో దు, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులపై వచ్చే దరఖాస్తులను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిష్కరించడంపై అవగాహన క ల్పించాలని తెలిపారు. ఈ నెల 21లోగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎ న్నికల విభాగం అధికారి ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment