కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
● 17నుంచి 30వరకు కార్యక్రమాలు ● డీఎంహెచ్‌వో డాక్టర్ హరీశ్‌రాజ్
మంచిర్యాలటౌన్: ఈ నెల 17నుంచి 30వరకు జాతీ య కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగంగా సర్వే కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని, కుష్ఠు వ్యా ధి నిర్మూలనకు కృషి చేయాలని డీఎంహెచ్‌వో డా క్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుష్ఠు వ్యాధి సర్వే కా ర్యక్రమాల పోస్టర్లను వైద్యులతో కలిసి విడుదల చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జి ల్లాలో 149 ఆరోగ్య ఉపకేంద్రాల్లో 650 మంది ఆశా కార్యకర్తల ద్వారా కార్యక్రమాలు చేపడుతా మని తెలిపారు. కుష్ఠువ్యాధి నిర్మూలనకు చేపట్టాల్సిన ప్రణాళికలు సిద్ధం చేశామని, వ్యాధి లక్షణాలు బ యటపడడానికి దాదాపు మూడేళ్ల నుంచి ఐదేళ్లు పడుతుందని అన్నారు. ఆరు నెలల నుంచి 12 నెలల్లోపు మందులతో వ్యాధి పూర్తిగా నయం చేయవచ్చన్నారు. చర్మంపైన మచ్చలు ఉంటే ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కుష్ఠువ్యాధిపై ఉన్న భయాన్ని వీడి సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపవైద్యాధికారి డాక్టర్ సుధాకర్‌నాయక్, డాక్టర్ ఏ.ప్రసాద్, డాక్టర్ అనిల్, సబ్ యూనిట్ అధికారులు నాందేవ్, జగదీశ్, కాంతారావు, పద్మ, చందు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment