వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం సబ్బెపల్లి శివారులోని మామిడి తోటలో వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్న ముగ్గురు వేట గాళ్లను గురువారం అరెస్టు చేసినట్లు లక్సెట్టిపేట అ టవీ రేంజ్ అధికారి అత్తె సుభాశ్ తెలిపారు. టీకానపల్లికి చెందిన చాకేపల్లి సత్తయ్య, చాకేపల్లి వెంకటేశ్, ధర్మారం గ్రామానికి చెందిన రావుల లక్ష్మణ్ పాంగోలిన్(అలుగు) వేటాడి మాంసం విక్రయిస్తుండగా వారిని అరెస్ట్ చేసి అలుగు మాంసం, పొ లుసును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హాజీపూర్ డెప్యూటీ రేంజ్ అటవీ అధికారి సునీత, ఎఫ్‌బీవోలు ఫరీదాబాను, సుభాశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment