
సమగ్ర అభివృద్ధికి ఆదర్శంగా నార్నూర్
● పీఎం అవార్డ్–2025 కోసం.. ● నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ)కి ఎంపిక ● 426 ఆస్పిరేషనల్ బ్లాక్స్‌లో టాప్ 30లో నార్నూర్
నార్నూర్: నాడు ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో నార్నూర్ మండలం మొదటి స్థానంలో ఉండేది. ఇక్కడి ఆదివాసీ గిరిజనుల జీవనాధారం వ్యవసాయం కాగా మౌలిక వసతుల లేమి, పరిమిత జీవనోపాధి అవకాశాలతో వెనుకబడి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. నేడు ఈ మండలం నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద ఒక సమగ్ర అభివృద్ధి మోడల్‌గా నిలుస్తోంది. ఈ మార్పు ఒక్కరోజులో దక్కింది కాదు.. పలు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సీఎస్‌ఆర్ భాగస్వామ్యాల సమష్టి కృషి ఫలితం.
జనవరి 7, 2023న నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద నార్నూర్ ఎంపికై ంది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధి, ఆర్థిక సమగ్రత వంటి కీలక రంగాల్లో పనితీరు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జూన్ 2023 నాటికి దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. డెల్టా ర్యాంకింగ్‌లో ఇది గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. దీనికి గుర్తింపుగా నార్నూర్ బ్లాక్‌కు రూ.కోటి ప్రోత్సాహక నిధి మంజూరైంది. ఇది అభివృద్ధి లక్ష్యాల సాధనలో స్ఫూర్తిదాయక ఘట్టం. అంతే కాదు.. పీఎం అవార్డ్స్ 2024 కోసం 426 ఆస్పిరేషనల్ బ్లాక్స్‌లో టాప్ 30లో ఒకటిగా నార్నూర్ ఎంపికై ంది.
● ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ఏబీపీ) కేటగిరీలో ప్రధానమంత్రి ప్రశస్తి అవార్డు–2024 రెండో రౌండ్‌కు నార్నూర్ బ్లాక్ ఎంపికై న సందర్భంగా ఈనెల 10న సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షి షా పాల్గొని బ్లాక్‌లో అమలు చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్య విజయాలను ప్యానెల్‌కు సమర్పించారు.
వ్యవసాయం– నీటి నిర్వహణ:
స్థిరమైన అభివృద్ధి దిశగా
● హార్టికల్చర్‌లో మిల్లెట్ ఫార్మింగ్, డ్రిప్ ఇరిగేషన్, బీఏఐఎఫ్ చేపట్టడం.
● హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భాగస్వామ్యంతో సుంగాపూర్, ఖంపూర్ గ్రామాల్లో చెక్ డ్యామ్‌లు నిర్మించి రైతులకు నీటి వనరులు మెరుగుపరిచే చర్యలు.
● దీర్ఘకాలిక సాగు కోసం సోలార్ బోర్‌వెల్స్, నీటి సంరక్షణ కార్యక్రమాల అమలు
● జల్ ఉత్సవంలో భాగంగా 500కు పైబడిన ప్రజలు నీటి పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం, నీటి నాణ్యత మెరుగుదల
మహిళా సాధికారత, ఆర్థికవృద్ధి
● 601 స్వయం సహాయక సంఘాలు, 6,721 మహిళా సభ్యులు, ఆర్థిక స్వావలంబన లక్ష్యం.
● మహువా లడ్డూ ప్రాజెక్ట్, సంప్రదాయ ఆహారాన్ని ఆదాయ వనరుగా మార్చడం.
● పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ పథకాలు, మహిళలు– యువత కోసం వ్యాపార అవకాశాలు కల్పించడం.
● నైపుణ్య అభివృద్ధి శిక్షణ, సైకత శిల్పం, డిజిటల్ స్కిల్స్–బ్యాంబూ క్రాఫ్ట్‌పై ప్రత్యేక శిక్షణ.
నూతన ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన
● నార్నూర్ ప్రత్యేక వెబ్‌సైట్ ( www. abpnarnoor. in) ప్రగతిపై లైవ్ అప్‌డేట్స్– ట్రాకింగ్.
● నార్నూర్ మానిటరింగ్ యాప్, పాఠశాల పరిశీలన–సమస్యల పరిష్కారానికి.
● పైలట్ ప్రజావాణి, బ్లాక్‌స్థాయి సమస్యల పరిష్కారం కోసం వేగవంతమైన వ్యవస్థ.
● స్మార్ట్ సీఎస్‌సీ సెంటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను డిజిటల్ ద్వారా అందించడం.
భవిష్యత్ దిశగా ముందడుగు
100 శాతం ఎన్‌క్యూఏఎస్ హెల్త్ సెంటర్ సర్టిఫికేషన్.
గిరిజన మ్యూజియం ఏర్పాటుకు ప్రణాళికలు.
ఆర్‌వో వాటర్ ప్లాంట్స్, కమ్యూనిటీ లైబ్రరీలు మరింత విస్తరణ
మహిళల ఆరోగ్యంపై అవగాహన, టెలీమెడిసిన్ క్లినిక్స్.
డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాసులను మరింత అభివృద్ధి చేయడం.
దేశ గ్రామీణ అభివృద్ధ్దికి ఒక మార్గదర్శకం
ఆస్పిరేషనల్ బ్లాక్‌గా మారిన నార్నూర్ ఇప్పుడు దేశంలోని గ్రామీణ అభివృద్ధికి గొప్ప మోడల్‌గా నిలుస్తోంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం కలిసి పనిచేయడం ద్వారా సాధ్యమైన విజయగాథ ఇది. అభివృద్ధి కొనసాగుతూ, ప్రజల సంక్షేమానికి మరింత ప్రాముఖ్యత ఇస్తూ నార్నూర్ అభివృద్ధి జ్ఞాపకంగా నిలుస్తుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందడుగు వేస్తాం.
– రాజర్షిషా, కలెక్టర్, ఆదిలాబాద్
విద్య, స్మార్ట్ క్లాసులు– నూతన మార్గదర్శకాలు
స్మార్ట్‌క్లాసులు, ఐసీటీ ల్యాబ్స్, వర్చువల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ విద్య అందించడం.
ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్‌సీ, టీ–హాబ్ ఎక్స్‌పోజర్ విహారయాత్రల ద్వారా విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం– ఇన్నోవేషన్ అవగాహన కల్పించడం.
యంగ్ ఓరేటర్స్ క్లబ్, ఇంగ్లిష్ లిటరసీ ప్రోగ్రాం, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం.
ఆరోగ్య పాఠశాల ద్వారా ఆరోగ్యం, మానసికోల్లాసం, వ్యక్తిత్వ వికాసంపై ఆరు రోజుల ప్రత్యేక శిక్షణ.
ఆరోగ్యం–పోషణ, సంక్షేమం వైపు అడుగులు..
వందశాతం ఏఎన్‌సీ నమోదు, సురక్షిత ప్రసవ సేవలు, గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు
గిరిజన పోషణ మిత్ర ప్రోగ్రాం అమలుతో ఆశ్రమ పాఠశాల(బాలికల)ల్లో రక్తహీనత నివారణకు చర్యలు
లంచ్ బాక్స్ సర్వీస్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ కుటుంబాలకు చెందిన గర్భిణులకు పోషకాహారం అందించేలా చర్యలు
ఎన్‌క్యూఏఎస్, రెడీ హెల్త్ సెంటర్స్, పీఎం జన్‌మన్ ఎంఎంయూ హెల్త్ క్యాంపుల ద్వారా గ్రామీణ ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం.

సమగ్ర అభివృద్ధికి ఆదర్శంగా నార్నూర్
Comments
Please login to add a commentAdd a comment