
రాష్ట్రస్థాయిలో 417వ ర్యాంకు
తాంసి: తాంసికి చెందిన జానకొండ అశోక్ కుమార్ గ్రూప్–3 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ర్యాంక్ సాధించాడు. ఇప్పటికే గ్రూప్–1లో 399 మార్కులు, గ్రూప్–2లో 380 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–3లో 284 మార్కులతో రాష్ట్రస్థాయిలో 417వ ర్యాంక్ సాధించాడు. వరుసగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్న అశోక్ ప్రస్తుతం జైనథ్ మండలం సుందరగిరి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివానని అశోక్‌కుమార్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment