గ్రూప్–3లో మెరిశారు
పట్టుదలతో చదివి..
మామడ: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రిటౌన్‌షిప్ కాలనీకి చెందిన లింగాల విజయలక్ష్మి–గోపాల్ దంపతుల కుమారుడు హరికృష్ణ. గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 96వ ర్యాంకు సాధించాడు. బీటెక్ పూర్తి చేసిన హరికృష్ణ తల్లిదండ్రుల ప్రొత్సాహంతో పట్టుదలతో చదివి విజయం సాధించాడు. గ్రూప్–2లో 338వ ర్యాంకు సాధించాడు.
పరీక్ష రాస్తే సెలెక్ట్ కావాల్సిందే..
మందమర్రిరూరల్: పట్టణంలోని ప్రాణహితకాలనీకి చెందిన బొడ్డు పోషక్క–భూమయ్య దంపతుల చిన్న కుమారుడు తిరుపతి. గ్రూప్–4, 2, 3లో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 2016లో సింగరేణిలో జేఎంఈటీ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూప్–4 పరీక్ష రాసి ఫలితాల్లో సత్తాచాటాడాడు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్–2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంకు, తాజాగా విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60 ర్యాంకు సాధించడంతో స్థానికులు ఆయన్ను అభినందించారు. గ్రూప్–1 ఉద్యోగం చేయడమే తన లక్ష్యమని తిరుపతి పేర్కొన్నాడు.
మెరిసిన మలక్‌చించోలి వాసి
సారంగపూర్: మండలంలోని మలక్‌చించోలికి చెందిన దాసరి పవన్ గ్రూప్–2, 3 ఫలితాల్లో మెరిశాడు. ఈయన తల్లిదండ్రులు దాసరి రమణయ్య–లక్ష్మి. స్థానికంగా వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. గ్రూప్–2లో 667ర్యాంకు, గ్రూప్–3లో 542 ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని పవన్ అంటున్నాడు.
గ్రూప్–3లో మెరిశారు
గ్రూప్–3లో మెరిశారు
Comments
Please login to add a commentAdd a comment