విద్యుత్ ఉచ్చులకు వేటగాడి బలి
రెబ్బెన: అడవి జంతువులను వేటాడేందుకు పొలంలో విద్యుత్ తీగలకు ఉచ్చు బిగుస్తుండగా వేటగాడు బలయ్యాడు. మండలంలోని నారాయణపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. నారాయణపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీకి చెందిన పొల్క రమేశ్ (45) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. అప్పుడప్పుడు అడవి జంతువులను వేటాడేవాడు. గురువారం రాత్రి బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరాడు. గ్రామానికి చెందిన గోలెం పెంటయ్య వ్యవసాయ పొలంలో అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ వైర్లు అమర్చాడు. విద్యుత్ సరఫరా అందించే క్రమంలో వైరు తగిలి షాక్ గురై అక్కడిక్కడే మృతిచెందాడు. తెల్లవారిన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. పొలంలో ఎవరో పడిపోయి ఉన్నాడని గ్రామస్తుడు తోట నవీన్.. రమేశ్ కుమారుడికి తెలిపాడు. అక్కడికి వెళ్లి చూడగా రమేశ్ పడిపోయి ఉన్నాడు. ఘటన స్థలంలో ఆయన ఒంటిపై కరెంట్ తీగ చుట్టుకుని ఎడమ చేతిలో కరెంట్ తీగ పట్టుకుని, కుడి చేతిలో కర్ర ఉన్నట్లు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుమారుడు సాయికృష్ణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment