కేబుల్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్‌రూరల్: కేబుల్ వైర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఐదుగురు దొంగలు శుక్రవారం మండలంలోని ఎల్లపల్లి శివారులో మోటార్ కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారు. రూరల్ ఎస్సై లింబాద్రి ఆధ్వర్యంలో కొండాపూర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు అనుమానాస్పదంగా కనిపించారు. వాహనం తనిఖీ చేయగా అందులో కేబుల్ వైర్లు లభ్యమయ్యాయి. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment