జీవితంపై విరక్తితో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జీవితంపై విరక్తితో సింగరేణి ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై దివాకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..జిల్లాకేంద్రంలోని గర్మిళ్లకు చెందిన సింగరేణి ఉద్యోగి వీర్ల శ్రీధర్ (43) సింగరేణి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం మానేయాలని భార్య శ్రీకరి మందలించడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం రాత్రి ఇంట్లో తన గదిలో లుంగీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు రోహన్, వచ్చన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment