ఏఐ బోధనను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ కుమార్‌దీపక్
జైపూర్/లక్సెట్టిపేట/జన్నారం: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా అందిస్తున్న విద్యా బోధన ను ఎఫ్‌ఎల్‌ఎన్‌లో వెనుకబడిన విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్‌దీపక్ సూ చించారు. జైపూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఏఐ ల్యాబ్(ఎఫ్‌ఎల్‌ఎన్–ఏఏఎల్–ఏఐ)లను ఎమ్మె ల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి శనివారం ప్రారంభించారు. జన్నారం మండలం మురిమడుగు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను ఎంఈవో విజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో జిల్లాలో తొలి విడతగా ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు ఏర్పాటు చేసిందని తెలిపారు. వచ్చే వారంలో మరికొన్ని పాఠఽశాలల్లో ల్యాబ్‌లు ప్రారంభిస్తామన్నారు. ఏఐ ల్యాబ్ ద్వారా చదువుల్లో వెనుకబడిన విద్యార్థులు వారికివారే నెర్చుకునే అవకాశం కలుగుతుందన్నారు. స్వీయ ప్రేరణ ద్వారా అభ్యసన అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతిలోనే కృతిమ మేధ ద్వారా బోధన అభ్యాసన చేయడం గొప్ప విషయమన్నారు. కృత్రిమ మేధ విద్యారంగంలో విప్లవాత్మకమైన ఆలోచన అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేలా బోధన చేయాలని సూచించారు. తల్లిదండ్రులు క్రమంతప్పకుండా విద్యార్థులను పాఠశాలలకు పంపించా లని తెలిపారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాలపై ఉ పాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మా ట్లాడుతు ప్రతీ విద్యార్థికి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండాలన్నారు. ఇందుకు ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు. అనంతరం పాఠశాలల ఆవరణ, వంట శాలలు, తరగతి గదుల ను పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. వంట సమయంలో తాజా కూరగాయలు, నాణ్య మైన నిత్యావసర సరుకులు వినియోగించాలన్నా రు. కార్యక్రమాల్లో సమగ్ర శిక్షణ సమన్వయకర్త చౌ దరి సత్యనారాయణముర్తి, డీఈవో యాదయ్య, మాస్టల్ ట్రైనర్ శ్రీధర్‌రెడ్డి, ఎంఈవోలు శ్రీనివాస్, హెలెన్ డారతి, హెచ్‌ఎంలు శ్యాంసుందర్, ప్రేమ ల, అజయ్‌కుమార్, శుభాష్, తహసీల్దార్ దిలీప్‌కుమార్, కంప్యూటర్ ఉపాధ్యాయుడు రాజేందర్, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అజయ్‌కుమార్, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శుభాష్, ఎమ్మార్పీ శివ తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలోని ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం పరీక్ష కేంద్రంలోని సౌకర్యాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ కిరణ్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment