ఆడబిడ్డకు అండగా ఉంటాం
● చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం అండగా ఉంటుందని ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. హాజీపూ ర్ మండలం వేంపల్లిలోని పద్మావతి గార్డెన్స్‌లో నియోజకవర్గంలోని హాజీపూర్, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాలతోపాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, కల్యాణలక్ష్మి, షాదీముబార్ చె క్కులను శనివారం పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి కింద రూ.41.15 లక్షలను 132 మందికి, కల్యాణలక్ష్మి, షాదీముబార్ కింద రూ.2,76,32,016లను 276 మంది లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్ర భుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అ ధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోహన్‌కు సేవారత్న అవార్డు
బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు గజ్జెల్లి మోహన్‌ను సేవారత్న అవార్డు, జాతీయ ఉగాది పురస్కారం వరించింది. హైదరాబాద్ తార అకాడమీ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రవీంద్ర భారతిలో భారతీయ సంప్రదాయ సాంస్కృతిక కళోత్సవంలో భాగంగా జాతీయ ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా స్వచ్చంధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మోహన్‌కు సేవారత్న అవార్డు, జాతీయ ఉగాది పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు సుమన్, ఐఏఎస్ అధికారి పరికి పండ్ల నరహరి, ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తార ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు సంకె రాజేశ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్, పలువురు రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
ఆడబిడ్డకు అండగా ఉంటాం
Comments
Please login to add a commentAdd a comment