పూడిక తీయించండి
● నీల్వాయి ప్రాజెక్టు ఎడమ ఆయకట్టు రైతుల ఆందోళన
వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్టు ఎడమ కాలువ పూడికతో నిండడంతో చివరి ఆయకట్టుకు నీళ్లు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్లపల్లి గ్రామం వద్ద పూడికతో నిండి ఉన్న కాలువ వద్ద శనివారం ఆందోళన చేశారు. రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇరువైపులా ఉన్న మట్టితో కాలువలో పూడిక పేరుకుపోయిందని తెలిపారు. మీటర్‌నర లోతు మట్టి ఉండటంతో నీళ్లు దిగువకు వెళ్లడం లేదని పేర్కొన్నారు. దీంతో గొర్లపల్లి, దస్నాపూర్, కొత్తపల్లి, వేమనపల్లి శివారు పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్నాయన్నారు. సుమారు 100 ఎకరాలకు నీరు అందడం లేదని తెలిపారు. అధికారులు స్పందించి కాలువ వెంట ఉన్న పూడికతోపాటు తుంగ, పిచ్చి మొక్కలను తొలగించి పొలాలకు నీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ డీఈ వెంకటస్వామికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా తన దృష్టికి రాలేదని, రెండు రోజుల్లో పూడిక తీయించి పొలాలకు నీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment