ప్రాణహితలో అరుదైన చేప
వేమనపల్లి: ఎన్నో జలచరాలకు నిలయమై న ప్రాణహి త నదిలో జాలరులకు ఆదివారం ఓ అరుదైన చేప చిక్కింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలోని బెస్తవాడకు చెందిన ఎల్లెల శ్రీనివాస్, ఎల్లెల గంగాధర్ ప్రాణహితలో చేపల వేటకు వెళ్లారు. దడంగి(పెద్దవల) వేయగా పెద్ద పులు సు, రౌవు చేపలతోపాటు మూడున్నర కిలోల నలుపు రంగు చేప దొరికింది. దీనిపేరు బొట్టు పిల్ల అని జాలర్లు తెలిపారు. కొందరు రాక్షసిచేప, మంగారా అని పిలుస్తారని పేర్కొన్నారు. దీనికి పొలుసులు ఉండకపోగా నలుపు, తెలు పు వర్ణంలో ఉంది. దీని మాంసం రుచితో పాటు ఆరోగ్యానికి మంచిదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment