మూతబడిన సూపర్ బజార్
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని నస్పూర్ షిర్కే కాలనీలో ఉన్న సూపర్ బజార్ కొద్ది రోజులుగా తెరుచుకోవడం లేదు. రెండు వారాలుగా ఈ దుకాణం మూసే ఉంటుందని కార్మికులు తెలిపారు. కంపెనీలోనే అతిపెద్ద ఏరి యాలో సూపర్‌బజార్ మూత పడడంతో కార్మికు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కాలనీల మ ధ్య ఉన్న ఈ సూపర్ బజార్‌లో నిత్యావసర సరుకులు, ఇతర గృహోపకరణాలు సరమైన ధరలకు ఇక్కడ లభిస్తాయి. నగదుతోపాటు కార్మికులకు ఇక్కడ క్రెడిట్ పద్ధతిలో కూడా సరుకులు ఇస్తారు. నెల తర్వాత ఈ డబ్బులను వారి వేతనం నుంచి రికవరీ చేసే వెసులుబాటు ఉంది. దీంతో కార్మిక కుటుంబాలు నెలాఖరున, డబ్బులకు ఇబ్బంది ఉన్న సమయంలో ఉద్దెరపై సరుకులు తీసుకెళ్తారు. రెండు వారాలుగా దుకాణం మూసి ఉండడంతో కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.
సొసైటీ పేరిట నిర్వహణ..
సింగరేణిలో కార్మిక కుటుంబాలకు వంట గ్యాస్, నిత్యావసర సరుకులు అందించడం కోసం ప్రత్యేక సొసైటీ ఉంటుంది. సింగరేణి కాలరీస్ కోఆపరేటీవ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ పేరుతో సొసైటీ ద్వారా ఈ సేవలు అందిస్తారు. ఇందులో పనిచేసే ఉద్యోగుల వేతనాలు, వారి పేరోల్ అన్నీ కంపెనీలో పని చేసే ఇతర రెగ్యులర్ కార్మికులకు భిన్నంగా వీరికి ఉంటుంది. గతంలో కంపెనీ వ్యాప్తంగా ఈ సొసైటీలో 150 మంది పర్మినెంట్ ఉద్యోగులు పనిచేసేవారు. కాలక్రమేనా రిటైర్ అయిన వారిస్థానంలో కొత్తవారిని తీసుకోలేదు. ఆర్థిక సంస్కరణలో భా గంగా అన్నింటిలో కొత పెడుతున్న యాజమాన్యం ఈ సొసైటీల సేవలను కూడా కుదించాలనే ఆలోచనలో కొత్త రిక్రూట్‌మెంట్ చేపట్టడంలేదు. దీంతో మ్యాన్‌పవర్ తగ్గుతూ వస్తుంది. నస్పూర్ షిర్కే కాలనీలోని సూపర్‌బజార్‌లో ఒక పర్మినెంట్ సొసైటీ ఉద్యోగితోపాటు మరో ఇద్దరు డైలీ రేటెడ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కౌంటర్‌పై పనిచేసే పర్మినెంట్ ఉద్యోగి ఫిబ్రవరి 28న రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో దుకాణం మూసి ఉంటుంది. సిబ్బంది కొరత కారణంగానే సూపర్‌బజార్ తెరవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
త్వరలో ఓపెన్ చేస్తాం
సిబ్బంది కొరత కారణంగానే సూపర్‌బజార్ తెరువడం లేదు. ఇక్కడ పనిచేసే ఉద్యోగి రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త వారిని తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే సిబ్బందిని సర్దుబాటు చేసి సూపర్ బజార్ తెరుస్తాం. కార్మికులకు సరుకులు అందిస్తాం.
– పాలకుర్తి రాజు, డీఎం,
సూపర్ బజార్స్
రెండు వారాలుగా తెరుచుకోని
సింగరేణి దుకాణం
ఉద్యోగుల కొరతే కారణం
Comments
Please login to add a commentAdd a comment