కాలువలో పూడిక తొలగింపు
వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్టు ఎడమ కాలువ పూడికతో నిండి పంటలకు సాగునీరు అందడంలేదు. దీనిపై ‘పూడిక తీయించండి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. డీఈ వెంకటస్వామి ఆదేశాల మేర కు ఏఈ విష్ణు, కాంట్రాక్ట్ కంపెనీ మేనేజర్ మల్లి కార్జున్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రాజలింగు ఆధ్వర్యంలో ఆదివారం గొర్లపల్లి వద్ద ఉన్న ఎడమ కాలువ వద్ద కు వెళ్లారు. పరిస్థితిని సమీక్షించి మీటర్‌నర లోతు ఉన్న మట్టి, తుంగ, పిచ్చి మొక్కలను జేసీబీ సహా యంతో తొలగించారు. బురద కారణంగా జేసీబీ దిగబడుతుండటంతో పనులకు కొంత ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల్లో పూడికతీత పూర్తి చేయిస్తామని అధికారులు తెలిపారు. పొలాలకు సాగునీరు ఇచ్చేలా చొరవ చూపిన ‘సాక్షి’, ఇరిగేషన్ కాంట్రాక్ట్ సిబ్బందికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
కాలువలో పూడిక తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment