స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి
● డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
మంచిర్యాలటౌన్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ డిమాండ్ చేశారు. టీ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్, మంచిర్యా ల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం నిరసన తెలిపారు. ప్రజాసమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీలో సభాపతిపై అనుచిత వ్యా ఖ్యలు చేయడం సరికాదన్నారు. సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్ర భుత్వంపై అక్కసుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం జగదీష్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment