దోపిడీ దొంగల అరెస్ట్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మ్యాక్స్ భవన్ వద్ద ఈ నెల 14 దోపిడీకి పాల్పడిన ఇద్దరు దొంగలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ తెలిపారు. సంబంధిత వివరాలను ఆయన కార్యాలయంలో వెల్లడించారు. స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి ప్యాగ పోశంపై దాడి చేసి ఆయన వద్ద ఉన్న బంగారు గొలుసును దోచుకున్నారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశామని, సీసీ పుటేజీ ఆధారంగా బండి నంబర్‌ను గుర్తించి దోపిడీకి పాల్పడిన దొంగలను గుర్తించామని తెలిపారు. స్థానిక సంజీవయ్య కాలనికి చెందిన ఎండీ.సమీర్, ఎండీ.జుబీర్‌లను అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించారని తెలిపా రు. నిందితుల నుంచి బంగారు గొలుసు, కత్తి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ ప్రమోద్‌రావు, ఎస్సై ప్రవీన్‌కుమార్, సిబ్బంది సుబ్బరావ్, మహేష్, ఉపేందర్‌లను డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment