చెరువులోపడి ఒకరు మృతి
నర్సాపూర్(జి): కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవ శాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన మండలంలని చర్లపల్లిలో సోమవారం జరిగింది. ఏఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... రాంపూర్ అనుబంధ గ్రామం చర్లపల్లికి చెందిన సుంకరి శ్రీనివాస్(45) సోమవారం తెల్లవారుజామున కాలకృత్యాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి గ్రామ శివారులోని ఊర చెరువు వద్దకు వెళ్లాడు. ఉదయం 9 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి వెతకగా ఒడ్డుపై శ్రీనివాస్ చెప్పులు కనిపించాయి. వెంటనే ఈతగాళ్లతో చెరువులో గాలించగా శ్రీనివాస్ మృతదేహం లభించింది. ప్రమాదవశాత్తు చెరువుల పడి మృతిచెందాడని శ్రీనివాస్ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment