సైకిల్ పై నుంచి పడి వ్యక్తి మృతి
కాసిపేట: మండలంలోని దేవాపూర్ మద్దిమాడ శివారులో సైకిల్ పై నుంచి కిందపడి ఓరియంట్ రిటైర్డ్ లోడింగ్ కార్మికుడు గాసికంటి రాజయ్య(65) మృతిచెందాడు. దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజిపూర్ మండలం సబ్బపల్లికి చెందిన రిటైర్డ్ లోడింగ్ కార్మికుడు రాజయ్య ఈ నెల 16న దేవాపూర్‌లోని తన కుమారుడు మల్లేష్ ఇంటికి వెళ్లాడు. సాయంత్రం 5గంటలకు తన స్నేహితుడిని కలవడానికి కొత్త గడ్‌పూర్‌కు వెళ్లి తిరిగి ఏడు గంటల ప్రాంతంలో కుమారుడి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో మద్దిమాడ శివారులోని కల్వర్టు వద్ద సైకిల్ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment