గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అందుగులపేట జా తీయ రహదారి ఫ్లై ఓవర్‌బ్రిడ్జి ముగింపు సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ల భ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడి ఒంటిపై నీలిరంగు చొక్కా, జీన్స్ ప్యాంట్ ఉన్నాయని, ప్యాంటు జేబులో ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వైపు వెళ్లే పల్లె వెలుగు బస్సు టికెట్ లభించిందని తెలిపారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో భద్రపర్చామని పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 8712656570 నంబరులో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment